మాధవిలత ఫిర్యాదుపై శివ బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. JC ప్రభాకర్ రెడ్డి పై MAA కి ఫిర్యాదు చేసింది నటి మాధవీలత. సినిమాలో నటిస్తున్న మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. అయితే…మాధవిలత ఫిర్యాదుపై శివ బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధవిలత గారు చాలా బాధతో ఉన్నారని అర్థమైందని… ఒక మహిళను బాధపెట్టడం కరెక్ట్ కాదని తెలిపారు.
ఒక పోస్టర్ చూసి అపార్థం చేసుకుని మాట్లాడడం మంచిది కాదని… రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడడం మానేసి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎంతో మంది యాక్టర్స్ పొలిటిషియన్స్ అయ్యారు. కానీ ఏ పొలిటిషియాన్ కూడా పేరున్న యాక్టర్ కాలేదని తెలిపారు. మేము కెమెరా ముందే నటిస్తాం.. రాజకీయ నాయకులు బయట కూడా నటిస్తారని వివరించారు. ఇండస్ట్రీ జోలికి రాజకీయ నాయకులు రావొద్దని… మాధవిలత గారి ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.