మహేశ్ ‘అతడు’లో శోభన్ బాబు.. నో చెప్పిన సోగ్గాడు.. కారణమిదే!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన పిక్చర్ ‘అతడు’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మ్యాజికల్ ఫిల్మ్ అయిన ‘అతడు’..అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫిల్మ్ టీవీల్లో వస్తే చాలు..ఇప్పటికీ జనాలు విశేషంగా ఆదరిస్తున్నారు.

sobhan babu shobhan babu

బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయిన ఈ మూవీలో మహేశ్ సరసన హీరోయిన్ గా త్రిష నటించింది. ప్రకాశ్ రాజ్, సోనుసూద్, నాజర్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ జయభేరి ఆర్ట్స్ సంస్థ ఈ పిక్చర్ ప్రొడ్యూస్ చేసింది. ఇక ఇందులో నాజర్ పాత్ర సినిమా స్టోరికి ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మహేశ్ తాతగా నాజర్..తన నటనతో సీన్స్ హైలైట్ అయ్యేలా నటించాడు. సహజ శైలిలో నటించి సమాయనుగుణంగా చక్కటి డైలాగ్స్ చెప్పి..సినిమా సక్సెస్ లో కీలక భూమిక పోషించారు. అయితే, ఈ పాత్ర కోసం టాలీవుడ్ సీనియర్ హీరో శోభన్ బాబును అనుకున్నారట. ప్రొడ్యూసర్ మురళీ మోహన్ ఈ విషయమై శోభన్ బాబును సంప్రదించి, ఆయనను ఒప్పించేందుకు ట్రై చేశారట. అయితే, శోభన్ బాబు మాత్రం ఒప్పుకోలేదట. తాను యవ్వనంగా ఉన్నన్ని రోజులు మాత్రమే సినిమాల్లో కనిపించాలనుకున్నానని చెప్పాడట.

తనను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అందగాడిగానే గుర్తుంచుకోవాలని శోభన్ బాబు చెప్పారు. బ్లాంక్ చెక్ ఆఫర్ ఇచ్చినా నో..చెప్పి..తన విలక్షణతను చాటుకున్నారు గొప్ప నటుడు. ఇక శోభన్ బాబు వారసత్వంగా ఎవరూ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. శోభన్ బాబు నో ..చెప్పిన క్రమంలో ఆ పాత్ర కోసం నాజర్ ను సంప్రదించారు మేకర్స్. అలా ఈ సినిమా వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version