కన్నడ నటి శోభిత కేసులో మరో ట్విస్ట్‌..సూసైడ్‌ నోట్‌ లభ్యం !

-

కన్నడ నటి శోభిత కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. కన్నడ నటి శోభిత నివాసంలో సూసైడ్‌ నోట్‌ లభ్యం అయింది. కన్నడ నటి శోభిత నివాసంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ లేఖ రాసింది కన్నడ నటి శోభిత. ఎవరిని ఉద్దేశించి శోభిత సూసైడ్ నోట్ ఈ లైన రాసింది అన్న కోణంలో దర్యాప్టు చేస్తున్నారు పోలీసులు.

shobitha

కాగా, కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు పూర్తి స్ధాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకుందా ? అనే కోణంలో కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసు దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.

శోభిత భర్త సుధీర్ రెడ్డి తో పాటు నైబర్స్ స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు పోలీసులు. మ్యాట్రిమోన్ లో శోభిత ప్రొఫైల్ చూసి మ్యారేజ్ ప్రపోజల్ చేసిన సుధీర్ రెడ్డి..ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. సుధీర్ రెడ్డి మ్యారేజ్ చేసుకున్న తర్వాత సీరియల్ నటించడం మానేసిన్నట్లు గుర్తించారు పోలీసులు. శోభిత ఆత్మహత్య ముందు ఎవరెవరితో మాట్లాడింది వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version