వాజేడు ఎస్సై సూసైడ్ కేసులో సంచలనం.. ప్రియురాలితో రిసార్టుకు వెళ్లాక!

-

ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఎస్సై ఆత్మహత్యకు పాల్పడగా.. నేడు ఉదయం విషయం వెలుగుచూసింది.ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. నిన్న రాత్రి తన ప్రియురాలితో హరిత రిసార్ట్‌కి వాజేడు ఎస్సై హరీశ్ వెళ్లినట్లు తెలుస్తోంది.

కాగా, ఈ నెల 14న హరీశ్ ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వ్యవహారం కారణంగానే తీవ్ర మనస్థాపానికి గురైన ఎస్సై హరీశ్.. గన్‌తో కాల్చుకొని చనిపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు.ఇదిలాఉండగా, నిన్న మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగిన పీఎస్ పరిధిలోనే ఎస్సై సూసైడ్ చేసుకోవడంతో కలకలం రేపింది. గత నెలలో ఈయన విధులు నిర్వహిస్తున్న పీఎస్ పరిధిలో ఇన్ఫార్మర్స్ నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హత్య చేశారు. నాటి నుంచి ప్రెజర్లో ఉన్నాడని సమాచారం. ఎస్సై సురేష్ ఆత్మహత్య పోలీస్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version