ప్రముఖ హీరోయిన్ సదా చెల్లెలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్..!!

-

ప్రముఖ హీరోయిన్ సదా అనగానే ప్రతి ఒక్కరికి జయం సినిమా గుర్తొస్తుంది.. సదా తన అందం, నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. నితిన్ హీరోగా గోపీచంద్ విలన్ గా సదా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఈ సినిమా అంతగా విజయాన్ని సొంతం చేసుకుంది అంటే ఇప్పటికీ ఈ రికార్డులను ఇంకా ఏ సినిమా బ్రేక్ చేయలేదనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో సదా కి చెల్లి గా నటించిన అమ్మాయి గురించి కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. ఇక ఈ సినిమాను సదా కి చెల్లెలు గా నటించిన యామిని శ్వేత కూడా ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఇక ఈ పాప కూడా తన నటనతో వాక్చాతుర్యంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన యామిని శ్వేత కి ఈ సినిమా ద్వారా నంది అవార్డు కూడా లభించింది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన ఎంతోమంది పెద్దయ్యాక హీరోయిన్లుగా బాగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఇండస్ట్రీకి కూడా కనుమరుగు అవుతూ ఉంటారు. అలాంటి వారిలో యామినీ కూడా ఒకరు. యామిని శ్వేత ఎవరో కాదు ప్రముఖ ఫీమేల్ ఆర్టిస్ట్ విజయలక్ష్మి కూతురు.. సాధారణంగా అప్పట్లో డైరెక్టర్ తేజ కి తన సినిమాలలో కొత్త వారికి అవకాశాలు ఇస్తూ ఉండడం అలవాటుగా ఉండేది. ఇక తనకు తెలిసిన తారలు, సాంకేతిక నిపుణులు పిల్లలు అందంగా ఉన్నారు .. సినిమాలలో నటించగలరు అంటే కచ్చితంగా వారిని తన సినిమాలలోకి తెచ్చేవరకు వదిలి పెట్టరు. అలా ఎంతో మంది కొత్త కొత్త పిల్లలకు అవకాశం ఇచ్చారు తేజ. ఇక ఈ క్రమంలోనే జయం సినిమా కి ఆర్టిస్ట్ విజయలక్ష్మి కూతురు అందంగా ఉంటుంది అనడంతో ఆమెను సదా కి చెల్లెలుగా తీసుకొచ్చి నటింప చేశారు.

ఇక ఈ సినిమాలో నటించిన నితిన్ కు మంచి అవకాశాలు లభించాయి.. అలాగే సదా కి కూడా శంకర్ డైరెక్షన్ లో నటించే అవకాశం లభించింది. కానీ యామినీ మాత్రం ఎక్కడ కనిపించలేదనే చెప్పాలి. ఇకపోతే మొన్నా మధ్య ఒక ఇంటర్వ్యూ కి హాజరైన ఆమెను ఎందుకు సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు అని అడగగా నిజానికి తనకు ఇండస్ట్రీ లోకి రావడం ఇష్టం లేదట. తనకు హీరోయిన్ గా కూడా ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిని వదులుకుని.. ఇక ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకుని సెటిల్ అయింది. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులకు చేరువలో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version