షాక్: కియరా – సిద్దార్థ్ పెళ్లిలో వంద రకాల వంటకాలు.. కోట్ల గిఫ్టులు..!

-

రాజస్థాన్లోని జై సల్మేర్ సూర్య గడ్ ప్యాలెస్ లో ప్రముఖ బాలీవుడ్ జంట కియారా అద్వాని – సిద్ధార్థ మల్హోత్రా మూడుముళ్ల బంధంతో ఏడు అడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. నిజానికి ఫిబ్రవరి 6వ తేదీన వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ ఒకరోజు వాయిదా వేసి ఫిబ్రవరి 7వ తేదీన నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం రాత్రి మెహందీ ఫంక్షన్ పూర్తి కాగా.. సోమవారం రాత్రి హాల్ది, సంగీత్ ఫంక్షన్ నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మెహందీ ఫంక్షన్ కుటుంబ సభ్యులు చాలా జోష్ గా నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఈ జంటను ఆశీర్వదించడానికి కియారా – సిద్దార్థ్ వెంట కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మీరా రాజపుత్ , జుహీ చావ్లా, అంబానీ కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. కియారాకు అంబానీ కూతురు క్లాస్మేట్ కావడంతో వారి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందట. అందుకే వారంతా కూడా నూతన వధూవరులను ఆశీర్వదించడానికి వేడుకకు విచ్చేశారు. అతిధులకు సకల వసతులతో పాటు భారీ ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా 100కు పైగా నోరూరించే వంటకాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇటాలియన్, సౌత్ ఇండియన్ , చైనీస్ , అమెరికన్, మెక్సికాన్, రాజస్థానీ , పంజాబీ, గుజరాతి వంటకాలను సిద్ధం చేశారట . జై సల్మేర్లోని గోత్వాన్ లడ్డూను కూడా ప్రత్యేకంగా వడ్డించనున్నట్లు సమాచారం. తన భార్యగా మారుతున్న ప్రియురాలికి పెళ్లి తర్వాత బహుమానం ఇవ్వడానికి సిద్దార్థ్ సిద్ధం అయినట్లు సమాచారం. పెళ్లి తర్వాత విలాసవంతమైన కారును, ఖరీదైన నెక్లెస్ ను ఆమెకు గిఫ్ట్ గా ఇస్తున్నారని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. సిద్ధార్థ్ ఇచ్చే గిఫ్ట్ విలువ కనీసం రూ. 5 కోట్ల రూపాయల మేరా ఉంటుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version