లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందింది హీరోయిన్ నయనతార. ఎట్టకేలకు తన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. అయితే తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ ను కొద్దిరోజుల క్రితమే వివాహం చేసుకున్నది. దీంతో ఈ మేరకు తను నటించబోయే సినిమాల నిర్మాతలు డైరెక్టర్లకు కొన్ని షరతులు విధించినట్టు గా సమాచారం ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నయనతార పెట్టిన కండిషన్లు ఏమిటంటే ఆమె ఖాళీగా ఉన్న సమయాలలో సినిమాలు చేస్తానని అందుకు తగినంతగానే తన కాల్షీట్లు ఉంటాయని తెలియజేసింది అట. శృంగారభరిత సన్నివేశాలలో, బికినీ సన్నివేశాలలో నటించనని తెగేసి చెప్పిందట. ఇలాంటి శరతులకు ఒప్పుకుంటేనే సినిమా చేస్తానని లేకుంటే అసలు చేయానని తన నిర్ణయాన్ని నిర్మాతలకు, డైరెక్టర్లకు సూటిగానే తెలియజేసిందని కోలీవుడ్ మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే నయనతార ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం వెనక సమంతానే కారణం అయి ఉంటుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.