గీత గోవిందం.. అయ్యో పాపం..!

-

విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలన విజయం అందుకుంది. ఓ మోస్తారు అంచనాలున్నా కేవలం స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే 100 కోట్ల కలక్షన్స్ ఫిగర్ టచ్ చేసి తన సత్తా ఏంటో చాటాడు విజయ్. ఇక ఈ సినిమా రిజల్ట్ ఈ రేంజ్ లో ఊహించని నిర్మాతలు సినిమా సాటిలైట్ రైట్స్ ను తక్కువ రేటుకే అమ్మేసారట. నిర్మాతలను చూసి అందరు అయ్యో పాపం..అని అనుకుంటున్నారు.

రిలీజ్ ముందే కావడం వల్ల సినిమాను జీ తెలుగు వారు కేవలం కోటిన్నర ఇచ్చి కొనేశారట. 100 కోట్ల సినిమా కేవలం కోటిన్నర  అంటే షాక్ అవ్వాల్సిందే. గీత గోవిందం కలెక్షన్లకు, దాని సాటిలైట్ రైట్ల లెక్కకు అసలు సూట్ అవలేదు. అయితే, సాధారణంగా ఏ సినిమా ఏ రేంజ్ హిట్టవుతుందో ఎవరికీ తెలియదు కనుక ఇటువంటి వాటి విషయంలో ఎవరూ ఏంచేయలేరు. రంగస్థలం, భరత్ అను నేను సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ రెండు చిత్రాలు బంపర్ హిట్ అయి, థియేటర్లో ఆడుతూండగానే, అమెజాన్ ప్రైం విడియోలో 50 రోజులకే విడుదలయ్యాయి. అమెజాన్‌లో 50రోజులకు ఒక రేటు, తర్వాత ఒక రేటు ఉంటుంది కాబట్టి, వాటి భవిష్యత్తును అంచనా వేయలేని నిర్మాతలు 50రోజుల కండిషన్‌కు ఒప్పుకున్నారు. అయినా కూడా వాటి ప్రసారాలు కలెక్షన్లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. సినిమాలు పెద్ద హిటయితే మాత్రం చానెళ్లకు కాసుల పంటే.

అయితే గీత గోవిందంతో పాటుగా టాక్సీవాలా రైట్స్ కూడా జీ తెలుగుకే అంటకట్టారట. ఒకవేళ అది కూడా హిట్ అయితే మాత్రం జీ తెలుగు పంట పడినట్టే. టాక్సీవాలా పోయినా గీత గోవిందం ప్రీమియర్ తో లాభం తెచ్చుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version