బాహుబలి తర్వాత రాజమౌళి తీయాలనుకున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా ఇప్పట్లో లేనట్టే అని అంటున్నారు. అదేంటి అక్టోబర్ లో మొదలవనున్న ఈ సినిమా ఇంత సడెన్ గా లేదనడం ఏంటంటే చరణ్, ఎన్.టి.ఆర్ లతో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన రాజమౌళి ఈ ఇయర్ ఎండింగ్ నుండి షూటింగ్ అనుకున్నాడు.
ఇద్దరు హీరోలకు కథ చెప్పనిదే సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడు రాజమౌళి. అయితే ఎన్.టి.ఆర్ అరవింద సమేతతో, చరణ్ బోయపాటి శ్రీను సినిమాతో బిజీ అవడం వల్ల రాజమౌళికి అసలు టైం ఇవ్వడం లేదు. అనుకున్నట్టుగా అక్టోబర్, నవంబర్ లో సినిమా మొదలుపెట్టాలి అంటే ఇద్దరు కలిసి ఓ నెల రోజులు ముందే డేట్స్ ఇవ్వాలి.
కాని పరిస్థితి చూస్తుంటే అలా కుదిరేట్టు లేదు. ఎన్.టి.ఆర్ సినిమా దసరాకే కాబట్టి అది రిలీజ్ అయ్యాక మల్టీస్టారర్ పై గురి పెట్టొచ్చు కాని చరణ్ బోయపాటి సినిమా మాత్రం ఇంకా చాలా షూటింగ్ చేయాల్సి ఉంది. అందుకే 2019లో ఆ సినిమా మొదలు పెట్టనున్నాడట రాజమౌళి.