పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగిపోయే న్యూస్.!

పవన్ కళ్యాణ్  సినిమా హరి హర వీరమల్లు’ షూటింగ్ చివరి షెడ్యూల్  రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంకొన్ని రోజులలో షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది.  రీసెంట్ గా బాలివుడ్ నటుడు బాబీ డియోల్ కూడా షూటింగ్ కు హాజరుఅయ్యారు. ఈ సినిమా షూటింగ్ కోసం బహుబలి రేంజ్ లో యుద్ద సన్నివేశాలు తీస్తున్నారట. దానికోసం అనేక రథాలు, గుర్రాలు, ఏనుగులు వినియోగిస్తున్నారట.

మరో పక్క హరీశ్ శంకర్ ముందు అనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ వదిలి, తమిళ సినిమా అయిన తెరి ను రీమేక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయమని పవన్ కళ్యాణ్ చెప్పి నట్లు గా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ చేతిలో సుజిత్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం బయటకు పొక్కింది.

సినిమా కోసం తీసిన సన్నివేశాలు నిడివి కూడా ఎక్కువ కావడం తో హరిహర వీరమల్లు మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బడ్జెట్ ఎక్కువ కావడం తో దాన్ని రికవరీ చేయాలంటే రెండు భాగాలు అయితేనే సేఫ్ జోన్లో ఉంటామని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం రెండు భాగాలు అంటే కొంచం టెన్సన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అంతకు ముందు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన  ఎన్టీఆర్ మూవీ కూడా ప్లాప్ ఆయిన సంగతి తెలిసిందే. అందుకే బాధ మరి.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?