BREAKING : నేడు టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్

-

BREAKING : నేడు టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు. గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు.

హెల్త్ ఇష్యూస్ సీరియస్ కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. గురువారం రాత్రి ఆయన మరణించారు. విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. ఆయన ఫిబ్రవరి 19, 1930లో జన్మించారు. ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ చేశారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్ లో పని చేసేవారు. అయితే, కె. విశ్వనాథ్ మృతి నేపథ్యంలో.. నేడు టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు టాలీవుడ్‌ చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version