తెలంగాణలో సినీ కార్మికులు గత కొద్ది రోజుల నుంచి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పైన పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో వేతనాలు పెంచాలని రేపటి నుంచి సినీ కార్మికులు మరోసారి సమ్మె చేపట్టారు. చిత్రీకరణలు పూర్తిగా నిలిపి వేస్తున్నామని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ స్పష్టం చేశారు. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే రెండు రోజులు సమయం ఇస్తామని చెప్పారు.

ఆ తర్వాత సినిమా షూటింగ్ లను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈరోజు జరిగే చర్చలపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. కార్మికుల శ్రమకు తగిన వేతనాల కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నామని సినీ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ స్పష్టం చేశాడు. కొద్దిరోజుల క్రితమే సినీ నటుడు చిరంజీవితో ఈ విషయం పైన సమావేశమైనప్పటికీ సినీ కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో మరోసారి సినీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆయన సినీ కార్మికులకు న్యాయం జరుగుతుందేమో చూడాలి.