Intestinal Worms: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు 11వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్లు, కాలేజీలలో ఈ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసున్న వారందరూ నులిపురుగుల మాత్రలను వేసుకోవాలని సూచించారు. పేగుల్లో ఉండే నులిపురుగులను నివారించి రక్తహీనతను అధిగమించడానికి మాత్రలు ఉపయోగపడతాయని చెప్పారు.

నులి పురుగుల మాత్రలు వేసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని స్పష్టం చేశారు. నులిపురుగుల మాత్రలు వేసుకోవడం వల్ల పిల్లలలో ఆకలి పెరుగుతుందని, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. నులిపురుగుల మాత్రలు వేసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని వెల్లడించారు. నులిపురుగులు కడుపులో ఉన్నట్లయితే చిన్న పిల్లలకు కడుపునొప్పి, ఆకలి లేకపోవడం, పిల్లలలో ఎదుగుదల లేకపోవడం, అల్సర్ లాంటి సమస్యలు తయారవుతాయి. అంతేకాకుండా కడుపులో శబ్దాలు రావడం, కడుపులో మంట లాంటి సమస్యలు నులిపురుగుల వల్ల ఏర్పడతాయి. అందువల్ల 1 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ నులిపురుగుల మాత్రలను తప్పకుండా వేసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.