కల్వకుంట్ల కవిత అలాగే కల్వకుంట్ల తారకరామారావు కుటుంబం మధ్య విభేదాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గులాబీ పార్టీలో ఉన్నప్పటికీ సొంతంగా రాజకీయాలు చేసుకుంటూ కల్వకుంట్ల కవిత ముందుకు దూసుకు వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రక్షాబంధన్ సందర్భంగా తన అన్నయ్య కల్వకుంట్ల తారకరామారావు అలాగే కేసిఆర్ కు రాఖీ కట్టలేదు కల్వకుంట్ల కవిత.

దీనిపై ఆమె స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఆమె వ్యవహరించారు. గులాబీ పార్టీ పైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని… కేటీఆర్ తో గ్యాప్ పైన మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు కవిత.