మంచు కుటుంబంలో మళ్లీ విభేదాలా..?

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారీ పాపులారిటీని దక్కించుకున్న ఫ్యామిలీస్ లో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గా ఈ కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. ఈ కుటుంబం నుంచి వచ్చిన మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్ అంటే కూడా అందరికీ విపరీతమైన అభిమానం. అయితే మంచు కుటుంబంలో ప్రస్తుతం మంచు మనోజ్ వల్ల విభేదాలు నెలకొన్నాయి అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. మనోజ్ – భూమా మౌనికలు ప్రేమించుకోవడం.. ఆమెతో పెళ్లి గురించి మంచు ఫ్యామిలీలో తెలియడంతో ఇంకా గొడవలు జరగడం మొదలయ్యాయి. దీంతో మంచు మనోజ్ మంచు కుటుంబానికి దూరమయ్యాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.

అంతే కాదు క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు కూడా తండ్రి మాటను ఏ రోజు జవదాటడు. ఈ క్రమంలోనే తమ్ముడు మనోజ్ తో మాట్లాడడం లేదని టాక్ నడుస్తోంది. ఇదంతా జరిగి రెండో నెలలు కావస్తున్నా.. ప్రస్తుతం మంచు మనోజ్ తల్లిదండ్రులతో కలిసి ఉండడం లేదు. తాజాగా మంచు మనోజ్ చేస్తున్న పనులు చూస్తుంటే మళ్ళీ మంచు కుటుంబంతో బంధం కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఉందని కొంతమంది అభిమానులు చెప్పుకొస్తున్నారు. అసలు సంగతి ఏమిటంటే.. ఇటీవల మంచు విష్ణు పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే.

అయితే ఆరోజు జంబలకడి జారు మిఠాయి సాంగ్ పాడించి మన విష్ణుకు బర్తడే విషెస్ చెప్పాడు మనోజ్. తమ్ముడు చెప్పిన విషెష్ కి కనీసం విష్ణు స్పందించలేదు. తనకు విష్ చేసిన వారందరికీ కూడా థాంక్స్ చెప్పిన విష్ణు.. సొంత తమ్ముడికి థాంక్స్ చెప్పకపోవడంతో మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే నిన్న మంచు విష్ణు కుమార్తేలైన అరీయానా.. వివియానా బర్తడే కావడంతో బాబాయిగా ఇద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. కానీ వీరు రెస్పాన్స్ ఇవ్వలేదు. మనోజ్ ఎంత దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నా.. మంచు కుటుంబం అతన్ని దూరం పెడుతోంది అని వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే వీరే స్పష్టత ఇచ్చేవరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version