వారణాసిలో తెలంగాణ వాసులు మృతి.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

-

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసులు మృతి చెందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు తక్షణమే సహాయక చర్యలు అందించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకట్రామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లారు.

పుణ్యస్నానం ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో వారణాసి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు టిప్పర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి, భార్య విలాసిని అలాగే కారు డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వెంకట్రామిరెడ్డి స్వగ్రామం న్యాల్ కల్ మండలం మామిడిగీ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version