తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్‌పై శ్రుతి హాసన్ క్లారిటీ

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతోందంటూ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా పుకార్లు వస్తున్నాయి. మానసిక రుగ్మతతో తీవ్రంగా సఫ్ఫర్ అవుతోందంటూ రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వీటన్నింటికి తాజాగా చెక్ పెట్టింది ఈ బ్యూటీ. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై ఓ క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే..?

“‘ఇలాంటి తప్పుడు సమాచారం, విపరీతమైన నాటకీయత కారణంగా చాలామంది తమ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను బయటపెట్టడానికి భయపడుతుంటారు. నేను ఎప్పుడూ ఒక మానసిక నిపుణురాలిగా వ్యవహరిస్తుంటాను. అన్నివిధాలుగా నన్ను నేను సంరక్షించుకుంటాను. కాబట్టి నేను ఏవిధంగానూ మానసిక అనారోగ్యానికి గురి కాలేదు. కేవలం వైరల్‌ ఫీవర్‌తోనే ఇబ్బందిపడుతున్నా. నన్ను ఇబ్బందిపెట్టడానికి బాగా ప్రయత్నించారు. మీరూ ఒక్కసారి చెక్‌ చేసుకోని అవసరమైతే మానసిక వైద్య నిపుణులను సంప్రదించండి” అని శ్రుతి హాసన్ క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version