సీఎం రేవంత్ నిర్ణయాన్ని నేను సమర్థిస్తాను.. రూట్ మార్చిన సిద్ధార్థ్

-

సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ నియంత్రణపై అవగాహన కల్పించేలా వీడియోలు చేయాలని సినీ నటులకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నటుడు సిద్ధార్థ్ మాట్లాడుతూ నటులు సామాజిక బాధ్యత కలిగి ఉంటారని అన్నారు. భారతీయుడు2 సినిమా ప్రమోషన్స్లో దీనిపై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. దీనిపై ఆయన స్పందిస్తూ తాను ఓ కోణంలో చెబితే దాన్ని కొందరు మరో కోణంలో చిత్రీకరించారని అన్నాడు.

‘‘భారతీయుడు 2’ ప్రెస్‌మీట్‌లో ఓ ప్రశ్నకు నేనిచ్చిన సమాధానాన్ని కొందరు అపార్థం చేసుకున్నారు. దాన్ని నేను క్లియర్‌ చేయాలనుకుంటున్నా. డ్రగ్స్‌పై పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి గారికి నా పూర్తి మద్దతిస్తా. మెరుగైన సమాజం కోసం డ్రగ్స్‌ కట్టడికి చిత్ర పరిశ్రమ తన వంతు కృషి చేయాలని సీఎం సూచించారు. మన పిల్లల భవిష్యత్తు వారి చేతుల్లోనే కాకుండా మన చేతుల్లోనూ ఉంది. ఇప్పటి వరకూ పలు సామాజిక కార్యక్రమాలను నేను సపోర్ట్‌ చేశా. సీఎం సర్‌.. మేం ఎప్పుడూ మీతోనే’’ అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version