మా రైతు బిడ్డ ప్రశాంత్ కు అభినందనలు: హరీశ్ రావు

-

బిగ్ బాస్ సీజన్ – 7 విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు. ‘మా సిద్దిపేటకు చెందిన రైతుబిడ్డ విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉంది. పొలాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సీజన్ లో రైతుగా బరిలోకి దిగిన పల్లవి ప్రశాంత్ సామాన్యుల దృఢ సంకల్పానికి ప్రత్యేకగా నిలిచారు’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.

Siddipet Mla Harishrao Appreciate Biggboss 7 Winner Pallavi Prasant

కాగా, నిన్నటి ముగిసిన బిగ్ బాస్ షోలో పల్లవి ప్రసాద్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. షో అనంతరం హైదరాబాద్ లోని బిగ్ బాస్ సెట్ నుంచి బయటికి వస్తున్న రన్నరప్ అమర్దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. ఈ క్రమంలో అమర్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కారులో అమర్ కుటుంబసభ్యులు వెనుక సీటులో కూర్చున్నారు. జనం వెనుక అద్దం పగలగొట్టడంతో వారు భయాందోళనలకు లోనవడం కనిపించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version