IPL ఆటగాళ్లకు బీసీసీఐ గుడ్‌ న్యూస్‌..ఇక అందరికీ ఇన్సెంటివ్స్?

-

IPL ఆటగాళ్లకు బీసీసీఐ గుడ్‌ న్యూస్‌.. ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ క్యాప్డ్ ప్లేయర్లకు ఈ నజరానా అందించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ ఐపీఎల్ లో రాణించి అంతర్జాతీయ జట్టులోకి ఎంపికై పదికి పైగా మ్యాచ్లు ఆడిన వారికి నజరానాను డబుల్ చేయాలని నిర్ణయించినట్లు టాక్. ఐపీఎల్ వేలంలో రూ. 50 లక్షలకు పైగా ధర పలికిన వారికి మాత్రమే ఈ ఇన్సెంటివ్స్ వర్తించనున్నాయి.

కాగా….ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు పెద్ద దుమారమే రేపుతోంది. ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం అందరిని షాక్ కు గురిచేసింది. ముంబై నిర్ణయాన్ని హిట్ మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ టాస్ టైం లో రోహిత్ ను కెప్టెన్ గా చూడలేమంటూ ఆవేదనతో పోస్టులు పెడుతున్నారు. “గుండె రాయి చేసుకోక తప్పేలా లేదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version