శింబు “ముత్తు” మూవీ విడుదల వాయిదా!

-

శింబు ప్రధాన పాత్రలో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందించిన తమిళ చిత్రం ” వెందు తనిందతు కాడు “. సిద్ధి ఇద్నాని కథానాయక. రాధిక కీలక పాత్ర పోషించారు. శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ.. ” ది లైఫ్ ఆఫ్ ముత్తు” పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనుంది. గణేష్ నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చాడు. బ్రతకడం కోసం పట్నానికి వెళ్లిన ఒక పల్లెటూరి యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనేది కథ.

తమిళం తో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఈనెల 15వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రేపు ఈ సినిమా థియేటర్లోకి రావడం లేదని ప్రకటించారు. కారణం.. తెలుగు అనువాదానికి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదట. వారం రోజుల క్రితమే స్రవంతి వారిచేత డీల్ కుదరడం వలన, ఇంత తక్కువ గ్యాపులో డబ్బింగ్ పనులు పూర్తి చేయడం కుదరలేదనిి టాక్. అందువల్లనే ఈ సినిమాను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు. కోలీవుడ్ లో ఈ సినిమాకి మంచి టాక్ వస్తే పర్వాలేదు.. లేదంటే ఇక్కడికి ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version