కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రముఖులు కూడా పెళ్లిళ్లకు రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ప్రముఖ టాలీవుడ్ సింగర్ రేవంత్.. తన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. గుంటూరుకు చెందిన అన్వితను నిన్న రేవంత్ పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహ వేడుక గుంటూరు లోని ఓ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా మమమ్మారి నేపథ్యంలో కుటుంబ సభ్యులు బంధు మిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగినట్లుగా సమాచారం అందుతోంది.
అంతేకాకుండా.. టాలీవుడ్ కు చెందిన చెందన పలువురు గాయనీ, గాయకులు కూడా ఈ వివాహానికి హాజరైనట్లు సమాచారం అందుతోంది.సింగర్ రేవంత్, అన్వితల ఎంగేజ్మేంట్ డిసెంబర్ 24 వ తేదీన జరుగగా.. ఫిబ్రవరి 6 వ తేదీన పెళ్లి జరిగింది.
ఇది ఇలా ఉండగా… సింగర్ రేవంత్ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడారు. ప్రభాస్ హీరోగా నటించిన బహుబలి సినిమాలో మనోహరి అనే పాట ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అదే విధంగా ఇండియన్ ఐడల్ 9 విజేతగా నిలిచి బాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకున్నాడు. తన గాత్రంతో ఇండియన్ ఐడల్ జడ్జీలను సైతం సింగర్ రేవంత్.. ఆశ్చర్యపరిచారు. ఇక ప్రస్తుతం రేవంత్ అన్విత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆయన అభిమానులు నూతన దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.