కేసీఆర్ పై దేశ ద్రోహం కేసులు వేస్తామని మాజీ ఎమ్మెల్సీ బిజెపి నేత రామ చందర్ రావ్ వార్నింగ్ ఇచ్చారు. బిజెపి కార్యకర్తల మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని నిప్పులు చెరిగారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్….ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని మండిపడ్డారు.
వెంకటాచలయ్య కమిటీని ఏర్పాటు చేసింది ఎన్డీయే ప్రభుత్వమే… అది రాజ్యాంగ సమీక్ష కోసం మాత్రమేనని.. రాజ్యాంగంపై మాట్లాడిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటానికి బీజేపీ లీగల్ సెల్ సిద్ధమైందన్నారు… ప్రతి కోర్ట్ ముందు రాజ్యాంగాన్ని కాపాడాలనే నినాదంతో దీక్షలు చేస్తామని.. కేసీఆర్ వ్యాఖ్యలను దేశ ద్రోహచర్య కింద బిజెపి భావిస్తోందన్నారు.
దేశ ద్రోహం కింద కేసీఆర్ పై… కేసు ఫైల్ చేస్తామని హెచ్చరించారు. చేంజ్ సీఎం నాట్ constitution పేరుతో ఫిబ్రవరి 14 నుండి కోర్ట్ ల దగ్గర కార్యక్రమాలు చేపడతామన్నారు. కేసీఆర్ వ్యాఖ్యల పై ప్రైవేట్ కేసులు పెడతారని చెప్పారు రామ చందర్ రావ్.