సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరిస్తున సంగతి తెలిసిందే. PMJ జ్యువెల్స్ లాంచ్‌లో సితారతో పాటు నమ్రతా శిరోద్కర్ కూడా పాల్గొనడంతో.. అప్పుడు ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్‌పై అంబాసిడర్ సితార ఫోటోలతో ప్రమోషన్స్ చేసింది PMJ జ్యువెల్స్.
అయితే ఈ క్రిస్మస్ సమయంలో అది కూడా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వంటి బిజీ ప్రాంతంలో సితారకు సంబంధించినా అందమైన ఫోటోలతో తమ జ్యువెలరీని ప్రమోట్ చేయాలనుకున్న PMJ జ్యువెల్స్ ప్లన్స్ సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి. అయితే ఈ ప్రమోషన్ కు సంబంధించిన వీడియోను PMJ జ్యువెల్స్ పోస్ట్ చేయగా.. అందులో చాల మంది అమెరికన్స్ అక్కడ ఆగి.. తమ ఫోన్ లలో సితార ఫోటోలను క్లిక్ చెయ్యడం మనకు కనిపిస్తుంది. ఇక కేవలం సితార ఓ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సమయంలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించింది అంటే.. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే మాములుగా ఉండద్దు అని మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.