టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట పెళ్లి పీటలు ఎక్కడనుంది. అక్కినేని నాగచైతన్య అలాగే హీరోయిన్ శోభిత త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవలే అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత….. ఎంగేజ్మెంట్ ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ ఐదో తేదీ లేదా… డిసెంబర్ చివర్లో… పెళ్లి ముహూర్తాలు ఉన్నాయట. ఈ తరుణంలోనే… అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
విదేశాల్లో వీళ్ళ వివాహం జరిపించేందుకు… అక్కినేని నాగార్జున కుటుంబం ప్లాన్ చేస్తూందట. రష్యాలో అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత వివాహం జరిగే ఛాన్స్ ఉందట. ఈ మేరకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా… టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా కు విడాకులు ఇచ్చిన తర్వాత… మూడేళ్లు ఖాళీగా ఉన్నాడు అక్కినేని నాగచైతన్య. కానీ మొన్న ఆగస్టులో 8వ తేదీన… టాలీవుడ్ హీరోయిన్ శోభితాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు నాగచైతన్య.