అమెరికా ఎన్నికలు.. భారత ఈవీఎంలపై కేఏ పాల్ సంచలన కామెంట్స్

-

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డెమెక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. నిత్యం వరుస డిబేట్లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఎన్నికలు జరిగిన అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఫలితాల వెల్లడికి మరికొద్ది రోజులు సమయం పట్టనుంది.

ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. ఫిలడెల్ఫియా నుంచి పాల్ మాట్లాడుతూ.. ఇండియాలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లుగా అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకూడదని హాట్ కామెంట్స్ చేశారు. గతంలో కేపిటల్ బిల్డింగ్‌ మీద జరిగిన దాడి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆకాంక్షిచారు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా అమెరికా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version