ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగం లోని షెడ్యూల్ 10 ప్రకారం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కు ఉందని ధర్మాసనం వెల్లడించింది. అదేవిధంగా నాలుగు వారాల్లోపు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.
ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పు పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హతపై ధర్మాసనం తీర్పు బీఆర్ఎస్ నేతలకు చెంపపెట్టు లాంటిదన్నారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని.. నిర్ణీత సమయాన్ని కూడా కోర్టు ప్రస్తావించలేదని పేర్కొన్నారు. తగిన