ట్రెండింగ్ లో `సౌండ్ పార్టీ` ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్!

-

 

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టిస్తున్నారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌లై టాలీవుడ్ లో గ‌ట్టిగానే సౌండ్ చేసింది. ఇక ఇటీవ‌ల ఈ చిత్రం నుండి `మ‌ని మ‌ని మ‌ని మ‌నీ దీని ముఖ‌ములు సోమెనీ` అనే లిరిక‌ల్ వీడియో సాంగ్ లాంచ్ చేశారు.

ప్ర‌జంట్ ఈ సాంగ్ యూట్యూబ్ లో వైర‌ల్ అవుతోంది. డ‌బ్బు ప్రాధాన్య‌త గురించి యువ ర‌చ‌యిత పూర్ణ‌చారి ప్ర‌జంట్ ట్రెండ్ కి క‌నెక్ట‌య్యే విధంగా పాట రాయ‌గా మోహిత్ రెహ‌మానిక్ దానికి త‌గ్గ‌ట్టుగా మాంచి బీట్ తో కంపోజ్ చేశారు. యూట్యూబ్ లో వైర‌ల్ అవుతోన్న ఈ సాంగ్ మంచి వ్యూస్ తో రీల్స్ తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఫ‌స్ట్ లిరిక‌ల్ తోనే మంచి బ‌జ్ క్రియేట్ చేసిన `సౌండ్ పార్టీ ` చిత్రం ఇటు ఇండ‌స్ట్రీలో అటు ఆడియ‌న్స్ లో రీ -సౌండ్ సృష్టించ‌డం ఖాయం అన‌డంలో సందేహం లేదు. శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version