BREAKING : కేసీఆర్ మీద పోటీకి ఈటల జమున సై !

-

సీఎం కేసీఆర్ మీద పోటీకి ఈటల జమున సిద్ధం అయ్యారు. గజ్వేల్ బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈటెల రాజేందర్ సతీమణి ఈటల జమున. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దర్ఖస్తులు ఆహ్వానించగా నిన్నటితో గడువు ముగిసింది.

Etela Rajender’s wife Etela Jamuna applied for Gajwel BJP ticket

మొత్తం 6,003 దరఖాస్తులు రాగా చివరిరోజు 2,780 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపు రావు, డీకే అరుణ, లక్ష్మణ్ దరఖాస్తు చేసుకోలేదు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుండి దరఖాస్తు చేయగా హుజూరాబాద్ నుండి ఈటెల రాజేందర్, గజ్వేల్ నుండి ఆయన సతీమణి ఈటెల జమున దరఖాస్తు చేసుకున్నారు.

కాగా సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న దుబ్బాకలోని హబ్సిపూర్ చౌరస్తా వద్ద బీసీ బంధు బీసీలందరికి ఇవ్వాలని ధర్నా చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు పోలీసులు.సిద్దిపేట జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నా ఎటువంటి అనుమతులు లేకుండా ధర్నా చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు..ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు మరి కొంతమంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version