అను బేబీ వెంటపడుతున్న చైతు..!

-

మారుతి డైరక్షన్ లో నాగ చైతన్య, అను ఎమ్మాన్యుయెల్ లీడ్ రోల్స్ చేస్తూ వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. రమ్యకృష్ణ ఈ సినిమాలో చైతు అత్తగా నటిస్తుంది. ఈ సినిమా నుండి మొదటి సాంగ్ అను బేబీ సాంగ్ రిలీజ్ అయ్యింది. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ క్యాచీగా ఉంది.

మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఆగష్టు 31న రిలీజ్ అవుతుంది. అను బేబీ అంటూ హీరోయిన్ వెంట పడుతున్న చైతు అలరిస్తున్నాడు. సినిమాలో చైతు చాలా ఫ్రెష్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఈగోయిస్ట్ హీరోయిన్ వెంటపడుతున్న హీరో ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది.

సినిమా కూడా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నారు. సెప్టెంబర్ లో వరుస సినిమాలు ఉండటంతో ఈ సినిమా ఆగష్టు 31న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా చైతు కెరియర్ కు చాలా ఇంపార్టెంట్.. మరి శైలజా రెడ్డి అల్లుడుగా చైతు ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version