పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ అనే ప్రస్థావన ఎక్కడ వచ్చినా సందర్భం ఏదైనా కాస్త గౌరవం తగ్గింది అనిపిస్తే చాలు అవతల వాళ్ల పని అయిపోయినట్టే. ట్రోలింగ్స్ లో పవన్ ఫ్యాన్స్ చేసినంత ఎవరు చేయలేరు. కత్తి మహేష్, రాం గోపాల్ వర్మలను సోషల్ మీడియా వేదికగా ఆడేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.
ఇక ఇప్పుడు అదే దారిలో మహేష్ ఫ్యాన్స్ కూడా వెళ్తున్నారని అనిపిస్తుంది. గూఢచారి హీరోయిన్ శోభిత దూళిపాళ పట్ల మహేష్ ఫ్యాన్ వీరంగం తెలిసిందే. గూఢచారి సినిమాపై మహేష్ పాజిటివ్ ట్వీట్ చిత్రయూనిట్ ను ఆనందంలో ముంచెత్తింది. ఈ క్రమంలో మహేష్ కు ఆ సినిమా హీరోయిన్ సింపుల్ గా థ్యాంక్యూ అనేసింది. దీనితో మహేష్ ఫ్యాన్స్ ఈగో హర్ట్ అయ్యింది. దానితో ఆమెపై సోషల్ మీడియాలో శోభిత మీద విపరీతమైన కామెంట్స్, ట్రోలింగ్స్ చేశారు.
దీనిపై శోభిత స్పందించింది. మహేష్ పట్ల తనకు గౌరవం ఉంది. అయితే సోషల్ మీడియాలో ఏమాత్రం సేఫ్టీ లేదు అంటూ కామెంట్ చేసింది. శోభిత మాటలని బట్టి చూస్తే ఆమె కూడా హర్ట్ అయినట్టు తెలుస్తుంది. కాని ఈసారి ఫ్యాన్స్ ను ఏమి అనకుండా తెలివిగా తప్పించుకుంది. మరి అమ్మడి కామెంట్స్ కు మహేష్ ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.