లక్ష్మీస్ వీరగ్రంథం.. లక్ష్మీ పార్వతిగా శ్రీరెడ్డి..!

-

బాలకృష్ణ మొదలు పెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులుగా రిలీజ్ అవుతుండగా.. ఆయనకు పోటీగా ఎన్.టి.ఆర్ బయోపిక్ గా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటూ సంచలన దర్శకుడు ఆర్జివి మరో సినిమా మొదలు పెట్టాడు. ఇక వర్మకు సమాధానం చెప్పేలా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మరో ఎన్.టి.ఆర్ బయోపిక్ గా లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా ఎనౌన్స్ చేశాడు.

బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ ల కన్నా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలకు ఎక్కువ క్రేజ్ ఏర్పడింది. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆర్జివి రీసెంట్ గా సినిమా ఓపెనింగ్ కూడా జరిపాడు. ఇక వర్మ అలా మొదలు పెట్టాడో లేదో కేతిరెడ్డి కూడా లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వీరగ్రంథంలో లక్ష్మీ పార్వతిగా శ్రీరెడ్డి నటిస్తుందని తెలుస్తుంది.

కాస్టింగ్ కౌచ్ పై యుద్ధాన్ని ప్రకటించి ఆ తర్వాత హైదరాబాద్ నుండి చెన్నైకి షిఫ్ట్ అయిన శ్రీరెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథం ఛాన్స్ దక్కించుకున్నట్టు కోలీవుడ్ టాక్. మరి లక్ష్మి పార్వతిగా శ్రీరెడ్డి ఎలా అభినయిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version