శివుడి గెటప్‌లో నటి శ్రీరెడ్డి.. హ‌ల్‌చ‌ల్ చేస్తున్న టిక్ టాక్ వీడియో..!

టాలీవుడ్‌లో వివాదాలకు కారణమై ప్రస్తుతం చెన్నైలో ఉంటోన్న నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అస్సలు మొహమాటం, సిగ్గు అనేది లేకుండా బూతు పదాలను చాలా సింపుల్‌గా వాడేస్తుంటుంది శ్రీరెడ్డి. అప్పుడే సంప్రదాయ చీరకట్టులో పదహారణాల తెలుగుమ్మాయిలా కనిపిస్తుంది. ఏంటో.. ఈ శ్రీ‌రెడ్డి! ఎవరికి అర్థం కాద‌నిపిస్తుంది. ఇక తాజాగా శ్రీరెడ్డి సరికొత్త గెటప్‌లో దర్శనం ఇచ్చింది. ఇప్పటివరకూ రెగ్యులర్ కాస్ట్యూమ్స్‌లోనే కనిపించే ఆమె… ఉన్నట్టుండి… పరమశివుడి గెటప్‌లో కనిపించింది.

ఈరోజు శివరాత్రి సందర్భంగా పరమ శివుడి అవతారంలో శ్రీరెడ్డి దర్శనమిస్తూ ఓ టిక్ టాక్ వీడియోను పోస్ట్ చేసింది. శివుడి వేషధారణలో ఉన్న శ్రీరెడ్డి ఓ చేతిలో డమరుకం, మరో చేతిలో కర్ర ఉన్నాయి. డమరుకం మోగిస్తున్న శ్రీరెడ్డి పక్కనే కాషాయ దుస్తులు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్న ఇద్దరు భక్తులు (పాత్రధారులు) కనిపిస్తారు. ‘ఓం నమ: శివాయ’ చాంటింగ్ వినివిస్తుండగా శివుడి పాత్రలోని శ్రీరెడ్డి, భక్తుల పాత్రలో ఉన్న ఆ ఇద్దరు కలిసి చేసే విన్యాసాలు ఉన్నాయి. ఇక ప్ర‌స్తుతం ఈ టిక్ టాక్ వీడియో తెర వైర‌ల్ అవుతోంది. మ‌రి ఆ వీడియో మీరూ చూసేయండి..!