మాస్ డాన్స్ స్టెప్స్ తో ఇరగదీస్తున్న శ్రీలీలా.. వీడియో వైరల్..!

-

కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో సీనియర్ హీరో కం విలన్ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాతో మొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీలా గురించి పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె తన అందచందాలతో నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం ఏడు సినిమాలు ఉన్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఈమెను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది మాత్రం దర్శకుడు రాఘవేంద్ర రావు అని తెలిసిన విషయమే. ఇదిలా వుండగా సాధారణంగా సినీ ఇండస్ట్రీలో అవార్డు ఫంక్షన్స్ జరిగాయి అంటే ఆ హంగామా మామూలుగా ఉండదు. స్టేజ్ పై హీరో హీరోయిన్ల డాన్స్ పెర్ఫార్మెన్స్ లను కల్లార్పకుండా అభిమానులు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ , గ్లామర్ డ్రెస్సింగ్ స్టైల్ తో డాన్స్ తో అదరగొడతారు. ఈ క్రమంలోనే తాము నటించిన సినిమాలలోని పాటలే కాకుండా ట్రెండింగ్ లో ఏ సాంగ్స్ ఉన్నా కూడా వాటికి డాన్స్ చేస్తూ పాపులారిటీ దక్కించుకుంటూ ఉంటారు.

తాజాగా యంగ్ హీరోయిన్ శ్రీ లీలా కూడా పుష్ప సినిమాలోని సామీ సామి పాటకు సైమా అవార్డుల ఫంక్షన్లో అదిరిపోయే మాస్ స్టెప్స్ వేసింది. దీంతో ఇప్పుడు శ్రీలీలా డాన్స్ పెర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2022 సైమా అవార్డుల వేడుకలో భాగంగా సౌత్ ఇండియన్ సెలబ్రిటీలంతా ఎవరి స్టైల్ లో వారు పెర్ఫార్మెన్స్ చేశారు.. ఇప్పుడైతే సామీ సామి అంటూ శ్రీ లీలా చేసిన ఈ మాస్ పర్ఫామెన్స్ చూసి ఆమె అభిమానులతో పాటు పుష్ప మూవీ అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version