శ్రీ‌ముఖి ప్రేమ‌లో ప‌డిందా?

బుల్లితెర క్రేజీ యాంక‌ర్ శ్రీముఖి ప్రేమ‌లో ప‌డిందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. గ‌త కొంత కాలంగా శ్రీ‌ముఖిపై ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తూనే వున్నాయి. వాటిని లైట్ తీసుకుంటూ అవ‌న్నీ రూమ‌ర్సే అంటూ కొట్టి పారేస్తూ వ‌స్తోంది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం శ్రీ‌ముఖి ల‌వ్‌లో వుంద‌ని తెలిసింది. ఇంత‌కీ శ్రీ‌ముఖి మ‌న‌సుప‌డింది ఎవ‌రిని? .. ఇండ‌స్ట్రీ వ్య‌క్తేనా .. కాదా.. లేక బ‌య‌టి వ్య‌క్తా. బిజినెస్‌మెనా అనే చ‌ర్చ మొద‌లైంది.

అయితే విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం శ్రీ‌ముఖి ప్రేమిస్తున్న వ్యక్తి టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన వాడేన‌ని తెలిసింది. గ‌త కొంత కాలంగా అత‌డితో డేటింగ్‌లో వుంద‌ట‌. బిగ్‌బాస్ సీజ‌న్ 3లో శ్రీ‌ముఖి ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లి ర‌న్న‌ర‌ప్‌గా మిగిలిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌లు యూట్యూబ్ ఛాన‌ల్స్‌కి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇచ్చింది. అందులో ప్రేమ పెళ్లి పై త‌న‌కు ఎలాంటి ఆస‌క్తి లేద‌ని, త‌ను న‌చ్చాన‌ని ఎవ‌రైనా ముందు మా పేరెంట్స్‌ని ఒప్పించ‌మ‌ని చెబుతాన‌ని క్లారిటీ ఇచ్చింది.

కానీ ప్ర‌స్తుతం మాత్రం పేరెంట్స్‌కి తెలియ‌కుండానే త‌న మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌ని శ్రీ‌ముఖి ఎంపిక చేసుకుంద‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని స్వ‌యంగా శ్రీ‌ముఖి ప్ర‌క‌టించ‌నుంద‌ని ఇన్‌సైడ్ టాక్‌. బిగ్‌బాస్ సీజ‌న్ 3 త‌రువాత శ్రీ‌ముఖి మ‌రింతగా పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. అయితే సినిమాల్లో మాత్రం ఆశించిన స్థాయి ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకోలేక‌పోతోంది. శ్రీ‌ముఖి న‌టించిన `ఇట్స్ టైమ్ టు పార్టీ` ఎప్పుడు వ‌చ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియ‌లేదు.