జియోకి షాక్.. పడిపోయిన డౌన్ లోడ్ స్పీడ్ రేట్..!

అంతర్జాలంలో ప్రఖ్యాత గాంచిన జియో టెలికాం సంస్థకు షాక్ తగిలింది. దేశంలోనే స్పీడ్ గా దూసుకుపోతున్న జియోకి చిన్న స్పీడ్ బ్రేక్ పడింది. అదే రిలయన్స్ జియో డౌన్‌‌లోడ్ స్పీడ్ అక్టోబర్‌లో 1.5 ఎంబీపీఎస్ పడిపోయిందని టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. అక్టోబర్ నెలకు జియో స్పీడ్ 17.8 ఎంబీపీఎస్‌గా ఉంది. రెండవ స్థానంలో కొనసాగుతున్న ఐడియా 9.1 ఎంబీపీఎస్‌గా ఉంది. ఇదీ జీయో కన్నా 95% శాతం తక్కవ. తగ్గినా ఇంటర్నెట్ స్పీడ్ విషయం‌లో జియోనే నంబర్ వన్. జియో తర్వాతీ స్థానంలో ఐడియా కొనసాగుతుంది.

అంతేకాకుండా ఆప్ లోడ్ స్పీడ్ విషయంలో కూడా జియో ఇంకా వెనుక బడే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా కలసిపోయి పెట్టిన ఐడియా, వోడాఫోన్ లను ట్రాయ్ ఇంకా ప్రత్యేక టెలికాంలుగానే పరిగణిస్తోంది. సెప్టెంబర్‌లో 19.1 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో డౌన్‌ లోడ్ స్పీడ్, అక్టోబర్‌లో 17.8 ఎంబీపీఎస్‌ కు పడిపోయింది. సెప్టెంబర్‌ లో ఐడియా డౌన్ లోడ్ స్పీడ్ 8.6 ఎంబీపీఎస్‌ ఉండగా, 0.5 ఎంబీపీఎస్ మెరుగు పరుచుకుంది. మూడో స్థానంలో వొడాఫోన్ ఉంది. వొడాఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ 8.8 ఎంబీపీఎస్‌ నమోదు అవ్వగా.. సెప్టెంబర్ లో వొడాఫోన్ 7.9 ఎంబీపీఎస్‌గా ఉండేది. అయితే వొడాఫోన్ కూడా 0.9 ఎంబీపీఎస్ వరకు పెరిగింది. ఇక నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఎయిర్ టెల్ 7.5 ఎంబీపీఎస్ డౌన్‌ లోడ్ స్పీడ్ నమోదు చేసుకుంది. గత రెండు నెలల నుంచి ఎయిర్ టెల్ డౌన్ ‌లోడ్ స్పీడ్ స్థిరంగా ఉంది. స్పీడ్ మారినా వాటి వాటి స్థానాల్లోనే స్థిరంగా కొనసాగుతున్నాయి.

పడిపోయిన జీయో స్పీడ్ ని పెంచుకోవటానికి రిలయన్స్ సంస్థ ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో వేచి చూడాల్సిందే.. ఇక లాక్ డౌన్, కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటెర్నెట్ వాడకం పెరిగిన విషయం తెలిసిన విషయమే. దీంతో ఆయా టెలికాం కంపెనీలు తమ ఇంటర్నెట్ హై స్పీడ్ ను పెంచుకున్నాయి.