బుల్లితెరపై స్టార్​హీరోల జోరు.. సల్మాన్​కు వెయ్యి కోట్లు.. మరి బాలయ్య, నాగ్​కు?

-

వెండితెరపై నీరాజనాలు అందుకునే అగ్రతారలు టీవీ షోల్లో సందడి చేస్తే వచ్చే కిక్కే వేరు. సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ టీవీలకు అతుక్కునేలా చేయడంలో ఈ షోలు విజయవంతం అవుతున్నాయి. వెండితెర వేల్పులుగా వెలిగిన చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌లాంటి అగ్రహీరోలు ఈ టీవీ రియాలిటీ షోల్లో అదరగొట్టి కుటుంబ ప్రేక్షకుల ప్రేమాభిమానాలూ పొందారు. అయితే రాను రానూ ఈ స్టార్ హీరోల షోస్​ మరింత క్రేజ్​ను సంపాదించుకుంటున్నాయి. దీంతో మన తారలు కూడా వారి రెమ్యునరేషన్​ భారీగా పెంచేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే బాలీవుడ్​ స్టార్​ సల్మాన్ ఖాన్​ అయితే ఏకంగా బిగ్​బాస్​ తాజా సీజన్​కు ఏకంగా వెయ్యి కోట్లు డిమాండ్​ చేశారనే టాక్​ కూడా వినిపించింది. ఈ సందర్భంగా మన సెలబ్రిటీలు ఏఏ షోస్​ చేస్తున్నారు, వారి పారితోషికాలు ఎంత వంటి విషయాలను తెలుసుకుందాం…

బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. త్వరలోనే ‘సీజన్‌6’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌-6లో పాల్గొనే కంటెస్టెంట్‌ల ఎంపిక ప్రక్రియ మొదలైంది. మరోవైపు ప్రీపొడక్షన్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సారి కూడా అగ్ర నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే సదరు టెలివిజన్ ఛానల్‌ ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. సీజన్‌-6కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున పారితోషికం బాగా పెరిగినట్లు సమాచారం. ఈ సీజన్‌కోసం ఆయన రూ.15కోట్లు తీసుకుంటున్నారని టాక్‌. బిగ్‌బాస్‌ సీజన్‌-6 సెప్టెంబరు 4 నుంచి టెలికాస్ట్‌ కానుంది. ఈ సీజన్‌లో ఎంతమంది పాల్గొంటారు? ఎవరెవరు ఉంటారన్న విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు నాగార్జున సీజన్‌-5కు ఎపిసోడ్‌కు రూ.12లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అంటే మొత్తం సీజన్‌కు రూ.12కోట్ల వరకూ డిస్నీ+హాట్‌స్టార్‌ చెల్లించింది. ఇప్పుడు సీజన్‌-6 రూ.15కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.

ఇక హిందీ బిగ్​బాస్​ 16 విషయానికొస్తే.. అక్టోబర్‌లో ఇది ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి వరుసగా పన్నెండు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్న కండలవీరుడు సల్మాన్​ ఖానే.. తాజా షోకూ హోస్ట్​గా వ్యవహరించనున్నారు. అయితే ఈ సీజన్​కు ఆయన తన రెమ్యునరేషన్​ను అమాంతం మూడు రెట్టు పెంచేశారని, కొద్ది రోజుల క్రితం చర్చనీయాంశమైంది. 15వ సీజన్​కు దాదాపు రూ.350కోట్లు తీసుకున్న ఆయన.. తాజా సీజన్​ కోసం దాదాపు వెయ్యి కోట్లు తీసుకోబోతున్నారని ప్రచారం సాగింది. అప్పట్లో బీటౌన్​లో హాట్​టాపిక్​గా మారిన ఈ విషయం గురించి మళ్లీ ఏ ఊసు వినపడలేదు. అయితే.. కొత్త సీజన్ ప్రసార తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పుడా ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఇప్పుడందరూ దాని గురించే మట్లాడటం ప్రారంభించారు. ఒకవేళ ఇది కనుక నిజమైతే .. టీవీలో ప్రసారమయ్యే రియాల్టీ షోల్లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హోస్ట్‌గా సల్మాన్ పేరు​ నిలిచినట్టవుతుంది.

“అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం” అంటూ నందమూరి నటసింహం బాలకృష్ణ… తొలిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన సెలబ్రిటీ టాక్‌ షో ‘అన్‌ స్టాపబుల్‌ విత్​ ఎన్​బీకే’. ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారమైన ఈ కార్యక్రమం ‘మోస్ట్‌ వాచ్డ్‌ షో’గా అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందింది. టాక్​ షోలలో నెం.1గా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న తారల ముచ్చట్ల కన్నా.. బాలయ్య సందడే ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. దీంతో రెండో సీజన్​ కోసం వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ రెండో సీజన్​కు బాలయ్య తీసుకోబోయే రెమ్యునరేషన్​ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. స్ట్ సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్​ కోసం దాదాపు రూ.40 లక్షలకుపైగానే తీసుకుంటున్నారట. దీంతో మొత్తం 12 ఎపిసోడ్లు పూర్తిచేసేసరికి ఆయన దాదాపు రూ.6 కోట్లు ఆర్జించారని సమాచారం. క రెండో సీజన్‌కు తన పారితోషికాన్ని రెట్టింపు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై సోషల్​మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

కాగా, గతంలో పలువురు స్టార్ హీరోలు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించి అదరగొట్టారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు నాగార్జునతో పాటు మెగాస్టార్​ చిరంజీవి, ఎన్టీఆర్​, బిగ్​బాస్​కు ఎన్టీఆర్​, నాని, నెంబర్ వన్ యారీ షోకు రానా… ఇలా తమదైన శైలిలో హోస్ట్​గా వ్యవహరించి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నారు. ఈ షోలకు రెమ్యునరేషన్​ భారీగానే అందుకున్నారు. హీరోయిన్స్​లోనూ ‘మాస్టర్‌ చెఫ్‌’కు తమన్నా, సామ్​జామ్​కు సమంత, ‘ఆహా భోజనంబు’కు మంచులక్ష్మీ హోస్ట్​గా వ్యవహరించి ఆకట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version