సొంత మరదళ్లనే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోలు..!

-

నాటి జనరేషన్ తో పోల్చుకుంటే నేటి జనరేషన్ హీరోలు, హీరోయిన్లు తమకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.. కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కాలంలో.. కుటుంబ సభ్యులు చూసిన వారిని ఎక్కువ మంది వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపారు. అందులోనూ మామ కూతుర్లను ,అత్త కూతుర్లను వివాహం చేసుకున్నారు. సినిమా రంగంలో ఉన్నవాళ్లు సొంత బంధుత్వాలలో ఉన్నవాళ్లను పెళ్లి చేసుకోరు. అందులోనూ చిన్నప్పటినుంచి కలిసిమెలిసి ఉన్న మరదళ్లను, మేనకోడళ్ళ ను వివాహం చేసుకోవడానికి అసలు ఆసక్తి చూపించరు..

ఎందుకంటే చిన్నప్పటినుంచి కలిసి ఉండడం వల్ల జీవిత భాగస్వామిగా చేసుకుంటే ఆ ఫీలింగ్ ఉండదన్న భావన ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతమంది తల్లిదండ్రుల కోరికల మేరకు సొంత మరదలినే వివాహం చేసుకున్నారు.. వారెవరో ఇప్పుడు చూద్దాం..

మోహన్ బాబు – విద్యాదేవి , నిర్మలాదేవి:

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ముందుగా విద్యా దేవితో వివాహం జరిగింది. ఈ దంపతులకు మంచి లక్ష్మి ,మంచు విష్ణు జన్మించారు. అయితే కెరియర్ స్టార్టింగ్ లో మోహన్ బాబు సినిమాలపై దృష్టి పెట్టి భార్యను నిర్లక్ష్యం చేయడంతో నచ్చని విద్యాదేవి ఘర్షణపడి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత దాసరి కలుగజేసుకొని.. విద్యాదేవి సొంత చెల్లెలు నిర్మలాదేవితో మోహన్ బాబుకు మళ్ళీ పెళ్లి చేశారు.

ఎన్టీఆర్ – బసవతారకం:


నటరత్న ఎన్టీఆర్ తన సొంత మేనమామ కుమార్తె బసవతారకంలో వివాహం చేసుకున్నారు.. ఇంట్లో పెద్దలు చిన్నప్పుడే వీరికి పెళ్లి చేయాలని అనుకున్నారట. అందుకే ఎన్టీఆర్ కూడా చిన్నవయసులోనే తన మరదలు బసవతారకమును వివాహం చేసుకొని 11 మంది పిల్లలకు జన్మనిచ్చారు.

సూపర్ స్టార్ కృష్ణ – ఇందిరాదేవి :
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తన మరదలు అయిన ఇందిరా దేవీ ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు..

Read more RELATED
Recommended to you

Latest news