సంవత్సరానికి ఒక్కసారే దర్శనమిచ్చే శివాలయం ఎక్కడ ఉందో తెలుసా?

-

భారత దేశంలో దేవుళ్ళకు ఎక్కువ ప్రార్దన్యత ఇస్తారు.. అందుకే గుడిలేని గ్రామం ఉండదు.. ప్రతి వీధికి ఒక గుడి కనిపిస్తుంది.. ముఖ్యంగా శివాలయం లేని గ్రామం దేశంలో ఎక్కడా ఉండదనే చెప్పాలి.. రోజూ నిత్య పూజలు, అభిషేకాలతో పరమశివుడు పరవశించిపోతాడు. ఆలయానికి వచ్చే భక్తులు ప్రత్యేక పూజలు చేయించి, స్వామిని దర్శించుకుని తరించిపోతారు. నిత్యం పూజలు అందుకొనే శివుడు ఆలయాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి.. కానీ మనం చెప్పబోయే ఆలయం మాత్రం సంవత్సరానికి ఒకరోజు మాత్రమే తెరచి ఉంటుంది.. ఆ ఆలయం విశేషాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

ఈ ప్రత్యేకమైన పురాతన శివాలయం అక్కడెక్కడో కాదు.. మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో కొలువై ఉంది కేదారేశ్వర స్వామి ఆలయం. మహా శివరాత్రి రోజున మాత్రమే తలుపులు తెరుచుకునే ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. అందుకే ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. శివరాత్రి పర్వదినాన.. స్వామివారిని దర్శించుకుని పునీతులవుతారు. అతి ప్రాచీనమైన కేదారేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు.. ఆ రోజు రాత్రి శివ భక్తులు జాగారాలు చేస్తూ శివనామా స్మరణ చేస్తారు..

ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే.. తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి గ్రామంలోని నలుదిక్కుల నాలుగు శివాలయాలు నిర్మించారు.అందులో ఒకటే ఈ ఆలయం..ఆనాటి కాలంలో జరిగిన యుద్దాల వల్ల ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూత పడింది. శివలింగం ధ్వంసం కావడం అరిష్టంగా భావించి, ఆలయాన్ని మూసివేశారు. అలా నాటి నుంచి ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒక రోజు మహాశివరాత్రి రోజున మాత్రమే తిరిగి తెరుస్తున్నారు.. శివరాత్రి రోజు స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు.. అందుకే ఎక్కడెక్కడి నుంచో వేలాదిగా జనం తరలి వస్తారు..

Read more RELATED
Recommended to you

Latest news