సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్రతారాలుగా ఒక వెలుగు వెలిగి జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల కారణంగా మత్తుకు బానిస అయ్యి.. తమ జీవితాన్ని నాశనం చేసుకున్న ఎంతో మంది హీరోయిన్లు మనకు తారస పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా తమ వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యల వల్లే వారు తాగుడుకు బానిస అయ్యారు అని తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. అలా ఎవరెవరు స్టార్ హీరోయిన్లు తాగుడుకు బానిసలై తమ జీవితాన్ని కోల్పోయారో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.
సావిత్రి:
మహానటిగా గుర్తింపు తెచ్చుకొని ఎన్టీఆర్, ఏఎన్నార్ల చేత శభాష్ అనిపించుకున్న కథానాయిక సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటన జీవితం ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శ దాయకం. అద్భుతమైన ముఖ కవళికలతో, హావభావాలతో పాత్రలో లీనం అయిపోయి.. జీవించి మరీ నటించేది. అందుకే సావిత్రి మన మధ్య లేకపోయినా ఆమె సినిమాలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉండగా తన జీవితంలో మహారాణిలా గడిపిన సావిత్రి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త జెమినీ గణేషన్ మోసం చేశాడని తాగుడుకు బానిసగా మారి ఆ తర్వాత జీవితాన్ని నాశనం చేసుకుంది.
మీనా కుమారి:
కాలికి గజ్జె కట్టి కదం తొక్కుతూ ఆడి పాడింది అంటే ఫిదా అవని ప్రేక్షకులు ఉండరు. అంతలా తన ఆటపాటలతో ప్రేక్షకులను మైమరిపింప చేసింది మీనా కుమారి . అయితే ఈమె కూడా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే తాగుడుకు బానిస అయ్యి 39 సంవత్సరాల వయసులో క్యాన్సర్ తో మృతి చెందింది.
సిల్క్ స్మిత:
ఐటమ్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన గ్లామరస్ బోల్డ్ బ్యూటీ సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికి వేల కొద్ది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. అయితే ప్రేమ విఫలమై తాగుడుకు బానిసగా మారి డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.
మనీషా కొయిరాలా:
ఊర్వశి:
భర్త వదిలేయడంతో తాగుడుకు బానిసగా మారి ఎంతో మంచి కెరియర్ ను పోగొట్టుకుంది. కానీ ఇప్పుడిప్పుడే కెరీర్ పుంజు కుంటోంది.
శృతిహాసన్:
మొదటి ప్రియుడుతో బ్రేకప్ అయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లి తాగుడుకు బానిసగా మారి కెరియర్ను కొన్నేళ్లపాటు నాశనం చేసుకుంది. ఇక ఈ మధ్యనే మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారింది.