అనుష్క బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘అరుంధతి’ స్టోరి పుట్టిందిలా..వెరీ ఇంట్రెస్టింగ్..!

-

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సూపర్’ సినిమాతో బ్యూటిఫుల్ అనుష్క హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత అనతి కాలంలోనే ఈ సుందరి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ‘బాహుబలి’ పిక్చర్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది ఈ భామ. ఈ అమ్మడుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

హీరో రేంజ్ ఉన్న నటిగా అనుష్కను గుర్తిస్తారు దర్శకులు, అభిమానులు, సినీ లవర్స్. ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసి అనుష్క ..బ్లాక్ బాస్టర్స్ అందుకుంది. అలా ఆమె నటించిన సూపర్ హిట్ పిక్చర్ ‘అరుంధతి’. ఈ మూవీలో అనుష్క నటనకు ప్రేక్షకలోకం ఫిదా అయింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు.

‘అరుంధతి’ సినిమా కథ పుట్టుక వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరి ఉండటం విశేషం. ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి బంధువు ఒకరు పార్టీలో గద్వాల్ కోట గురించి పదే పదే మాట్లాడుతుండేవారట. అది గమనించిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి అసలేంటా? విషయం అని అనుకునే వారట. ఈ క్రమంలోనే శ్యామ్ ప్రసాద్ రెడ్డికి తన తాత చిన్నపుడు కోట గురించి చెప్తూ..కోటలో రాజ‌కుమారి పనివాడితో ఉండ‌గా అది చూసిన రాజు ఇద్దరినీ చంపేసి అదే గదిని సమాధి చేశాట. ఈ పాయింట్ ప్లస్ గద్వాల కోటను బేస్ చేసుకుని స్టోరి రచించుకుని సినిమా చేయాలనుకున్నాడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి.

ఈ పాయింట్స్ తీసుకుని కోడి రామకృష్ణ వద్దకు వెళ్లగా అక్కడ స్టోరి రెడీ అయిపోయింది. అప్పటికే ‘అంజి’ మూవీ చేసి ఫ్లాప్ అందుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ..‘అరుంధతి’ సినిమా కోసం ఫుల్ ఫోకస్ పెట్టి వర్క్ చేశారు. గ్రాఫిక్స్ ప్లస్ విజ్యువల్ ఎఫెక్ట్స్ కోసం చాలా కష్టపడి పని చేశారు. దర్శక, నిర్మాతలతో సమానంగా హీరోయిన్ అనుష్క ఈ సినిమా కోసం పని చేసింది. అలా ఆ చిత్రం విడుదల తర్వాత రికార్డులు సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version