రజనీకాంత్ నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే..

-

స్టైల్ కు కేరాఫ్, తమిళ్ తలైవా , సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ విదితమే. ఆయన నటించిన పిక్చర్ రిలీజ్ అయితే చాలు..జనాలు పండుగ చేసుకుంటారు. తమిళ్ లోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఈయన ఫిల్మ్స్ కు చక్కటి స్పందన లభిస్తుందని అందరికీ తెలుసు.

రజనీకాంత్ కు తెలుగునాట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా, ఆయన పోషించిన తొలి తెలుగు పాత్ర ఏమిటి? ఏ సినిమా? అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. రజనీకాంత్ తెలుగులో నటించిన తొలి చిత్రం ‘అంతులేని కథ’. ఇందులో హీరోయిన్ జయప్రదకు అన్నగా ‘మూర్తి’ అనే తాగుబోతు పాత్ర పోషించాడు.

తాగుడు అలవాటున్న వ్యక్తిగా, చెల్లెలి సంపాదనపైన ఆధారపడి బతికే వ్యక్తిగా కనిపిస్తాడు. ఓ సంఘటన కారణంగా ఆయనలో మార్పు వస్తుంది. అలా చక్కటి అభినయం కనబరిచి రజనీకాంత్..తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకున్నాడు.

ఈ ఫిల్మ్ లో నటించినందుకు రజనీకాంత్ కు అప్పుడు ఫిల్మ్ మేకర్స్ ఇచ్చిన రెమ్యునరేషన్ రూ.1,000. కమల్ హాసన్, జయప్రదలు ఇందులో నటించారు. 1976లో విడుదలైంది ఈ పిక్చర్. కాగా, ఈ మూవీ కంటే ముందే రజనీ తమిళ్, కన్నడ భాషలలో నటించారు. ‘అపూర్వ రాగంగళ్’ అనే తమిళ్ ఫిల్మ్ తో పాటు ‘కథ సంగమ’ అనే కన్నడ పిక్చర్ లో సహాయ పాత్రలు పోషించారు రజనీ. సూపర్ స్టార్ రజనీ ప్రజెంట్ ‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ పిక్చర్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తు్న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version