Pushpa: కొనసాగుతున్న మేనియా..విద్యార్థి జవాబు పత్రంలో ‘పుష్ప’ డైలాగ్స్. తగ్గేదేలే..

-

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప : ది రైజ్’ మేనియా ఇంకా కొనసాగుతోంది. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఇంకా చర్చనీయాంశంగా ఉంది. ఇక ఈ చిత్రంలో బన్నీ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పాన్ ఇండియా వైడ్ ఈ ఫిల్మ్ సక్సెస్ అయింది. ప్రజెంట్ ఈ చిత్రం సెకండ్ పార్ట్ ‘పుష్ప: ది రూల్’ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

‘పుష్ప’లో మన్నీ మేనరిజమ్స్.. డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న పిల్లాడి దగ్గరి నుంచి ముసలి వారి వరకు.. అందరికీ ఈజీగా అర్థమయ్యేలా క్యాచీగా డైలాగ్స్ ఉన్నాయి. ఈ సినిమాకు ఏర్పడ్డ క్రేజ్ వలన పశ్చిమ బెంగాల్ స్టేట్ లో ఓ స్టూడెంట్ చేసిన పని తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరలవుతున్నది.

టెన్త్ క్లాస్ స్టూడెంట్ అయిన సదరు విద్యార్థి ఆన్సర్ షీట్ లో ‘పుష్ప, పుష్పరాజ్ అపన్ లిఖేగా నహీ’ అని రాసేశాడు. దాని అర్థం నేను పరీక్ష రాసేదేలే అని పేర్కొన్నాడు. ఈ ఆన్సర్ షీట్ ఫొటోను ఉపాధ్యాయుడు ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది చర్చనీయాంశమవుతున్నది.

ఈ ఫొటో చూసి విద్యార్థులు ఇలా చేయడం సరికాదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాను సినిమాలాగే చూడాలని, ఇలా చదవకుండా నేను ఎగ్జామ్స్ రాయబోనని అనడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version