వరి కొనకపోతే కేంద్రానికి ఉరి వేస్తాం – బాల్కసుమన్

-

వరి కొనకపోతే కేంద్రానికి ఉరి వేస్తామని బాల్కసుమన్ వార్నింగ్ ఇచ్చారు. నమ్మి నలుగురు ఎంపీలను గెలిపిస్తే రైతులను నట్టేట ముంచారని.. ప్రతిపక్ష నాయకులక రైతాంగ పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వాళ్లకి అబద్ధాల మీద ఉన్న ప్రేమ ఆదుకోవడంలో ఉండదని.. అంబానీ, అదానిల మీద ఉన్న ప్రేమ అన్నం పెట్టే రైతులపై లేదని అగ్రహించారు.

తెలంగాణ రైతుల పట్ల కేంద్ర మంత్రులు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని.. పంజాబ్‌లో పూర్తిస్థాయి ధాన్యం సేకరిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? కొనదా? సమాధానం చెప్పేదాకా బీజేపీని, కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

తెలంగాణలో వడ్లను కొంటరో? లేదో? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పాలని.. ధాన్యం కొనుగోలులో కేంద్రం కుటిలనీతిని బయటపెట్టాలని, రైతులకు నిజం అన్నారు. తెలియాల్సిందేనని బిజెపి నాయకులను నీలాదీయండి… ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ వాళ్లను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు నిచ్చారు. సింగరేణి అంబానీ అదానీ లకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని.. బ్లాకుల వేలాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు విప్ బాల్కసుమన్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version