Bheemla Nayak : స్ట‌న్నింగ్ ఫెర్ఫార్మెన్స్.. భీమ్లా నాయ‌క్ కు మ‌హేశ్ బాబు ట్వీట్

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌గ్గుబాటి రానా కాంబినేషన్ లో వ‌చ్చిన భీమ్లా నాయ‌క్ సినిమా ఈ నెల 25 న విడుద‌ల అయిన విషయం తెలిసిందే. కాగ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ములేపుతుంది. గ‌త కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్ మానియా న‌డుస్తోంది. ఎక్క‌డ చూసినా.. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఫెక్లీలు, భీమ్లా నాయక్ పోస్ట‌ర్లే క‌నిపిస్తున్నాయి. భీమ్లా నాయ‌క్ సినిమా చేస్తున్న అరాచ‌కం పై ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు.

సినిమా రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మ‌ని.. చిత్ర బృందాన్ని మెచ్చుకుంటున్నారు. తాజా గా సూప‌ర్ స్టార్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు కూడా భీమ్లా నాయ‌క్ సినిమా సెన్సెషన్ పై స్పందించాడు. భీమ్లా నాయ‌క్ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా స్ట‌న్నింగ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చార‌ని ట్వీట్ చేశాడు. వ‌ప‌న్ క‌ళ్యాణ్ ఫెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉంద‌ని అన్నాడు. రానా సూప‌ర్ గా యాక్ట్ చేశాడ‌ని అన్నాడు. అలాగే భీమ్లా నాయ‌క్ చిత్ర బృందం పై ప్ర‌శంస‌లు కురిపంచాడు. త్రివిక్ర‌మ్ ర‌చ‌న బ్రిలియంట్ అని ట్వీట్ చేశాడు. అలాగే థ‌మ‌న్.. మ్యూజిక్ సెన్సెషన్ అని ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version