ఏ 1 ఎక్స్‌ప్రెస్ లో సిక్స్ ప్యాక్ ..సందీప్ కిషన్ స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో లేటెస్ట్ మూవీ …!

-

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. 2010 లో వచ్చిన ప్రస్థానం, స్నేహగీతం సినిమాలతో పరిచయమయ్యాడు. 2011 లో ‘షోర్‌ ఇన్‌ ద సిటీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. అంతేకాదు తమిళ సినిమాలలోను వరసగా నటించి మంచి ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. తెలుగులో రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి సినిమాలు సందీప్ కిషన్ కి హీరో ఇమేజ్ ని ఇచ్చాయి. ఇక సందీప్ కిషన్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లో పనిచేసిన సంగతి తెలిసిందే.

 

ఆ తర్వాత నుండి సోలో హీరోగా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, జోరు, రా రా కృష్ణయ్య, బీరువా, టైగర్, నక్షత్రం ..ఇలా తెలుగు తమిళం లో దాదాపు 25 సినిమాలకి పైగా నటించాడు. సందీప్ కిషన్ నటించిన సినిమాలన్ని మినిమం గ్యారెంటీ సినిమాలుగా నిలబడ్డాయి. ఇక నిను వీడని నీడను నేనే, నెక్స్ట్ ఏంటి సినిమాలతో ప్రయోగాలని చేయడం ప్రారంభించాడు. ఇక చిత్ర పరిశ్రమలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ అయిన ఛోటా కె నాయుడు, శ్యాం కె నాయుడు లాంటి ఇద్దరు మేనమామలున్నా కూడా తన కెరీర్ కి వాళ్ళ సహాయం తీసుకోలేదు.

ఇక తాజాగా సందీప్ కిషన్ లేటెస్ట్ సినిమా అప్డేట్ ని తన బర్త్ డే సందర్భంగా తెలిపాడు. ఏ.1 ఎక్స్‌ప్రెస్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ని ట్రై చేస్తున్నాడు. సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలతో పాటు నరగసూరన్, కచడతపర అనే రెండు తమిళ సినిమాలలోను సందీప్ నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version