కేన్స్‌లో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌కు ఫస్ట్ ప్రైజ్

-

ఫ్రాన్స్‌ వేదికగా 77వ కేన్స్ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. మే 14 నుంచి మొదలైన ఈ ఫెస్టివల్ 25వ తేదీన ముగియనుంది. అయితే ఈ ఏడాది ఉత్సవాల్లో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ కేన్స్‌-2024కు ఉత్తమ లఘు చిత్రంగా బహుమతి సొంతం చేసుకుంది. చిదానంద తెరకెక్కించిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో’ షార్ట్ ఫిల్మ్ వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానంలో నిలిచింది. దీంతో చిత్ర బృందానికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

16 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు. వృద్ధురాలి కోడిని ఎవరో దొంగలించడం.. దానిని కనుగొనడం కోసం ఆమె పడే తపనను ఇందులో చూపారు. ఇప్పుడీ షార్ట్‌ ఫిల్మ్ హాలీవుడ్‌ వాటితో పోటీ పడి మొదటి బహుమతి గెలుచుకోవడం పై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. ఇక మీరట్‌లో జన్మించిన భారతీయ చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించిన యానిమేటెడ్‌ చిత్రం ‘బన్నీ హుడ్‌’ ఈ పోటీలో తృతీయ బహుమతి గెలుచుకోవడం విశేషం. మే 23న బునుయెల్‌ థియేటర్‌లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.  ఉత్తమ లఘు చిత్రానికి 15,000 యూరోలు, తృతీయ స్థానానికి 7,500 యూరోలు అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version