తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక ఈయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. అలా చారిత్రాత్మకంగా తెరకెక్కించిన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణ. ఈ చిత్రం మంచి విజయాన్ని అందించడమే కాకుండా బాలకృష్ణను నటన పరంగా కూడా హైలెట్ చేసిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు సైతం చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే నిర్మాతలు ఈ పన్ను రాయితీలను ప్రజలకు ఇవ్వకపోవడంతో తిరిగి ఇప్పుడు ఆ పన్నును రికవరీ చేయాలని కోరుతూ కొంతమంది సినీ ప్రేక్షకులు సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో ఈ కేసు పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్ర విచారణ జరిపిన తర్వాత నిర్మాతలు సాయిబాబ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు..కొంతమంది ప్రతివాధులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.