సీఎం కేసీఆర్ నేడు పెద్దపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు గుజరాత్‌లో అమలు కావడం లేదన్నారు. అక్కడ దోపిడీ తప్ప మరొకటి లేదని, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం కేసీఆర్. అక్కడ్నుంచి వచ్చేటటువంటి గులామ్‌లు, దోపిడీ దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో కనబడుతున్నారు సీఎం కేసీఆర్.
వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెడుదామా? దయచేసి ఆలోచించండని సీఎం కేసీఆర్ అన్నారు. 26 రాష్ట్రాల రైతులు తమకు చెప్పారని, మా వడ్లు కొనరు అని చెప్పారన్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీలోనే నేనే స్వయంగా ధర్నా చేశానని, ధాన్యం కొనేందుకు మోదీకి చేత కాదంటూ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో నూకలకు, గోధుమలకు షార్టెజ్ వస్తుందని, పరిపాలన చేతగాక దేశ ఆర్థిక స్థితిని దిగజారుస్తున్నారన్నారు సీఎం కేసీఆర్. మోసపోతే గోస పడుతామని, ఒక్కసారి దెబ్బతింటే చాలా వెనక్కి పోతామన్నారు సీఎం కేసీఆర్.