రెండో పెళ్లిపై సురేఖ వాణి క్లారిటీ.. అలాంటి భ‌ర్తే కావాల‌ట‌!

-

ఒక క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా త‌న కెరీర్‌ను మొద‌లు పెట్టి ఎంతో పేరు తెచ్చుకున్నారు సురేఖ వాణి. చిన్న ఆర్టిస్టుగా మొద‌లైన త‌న ప్రొఫెష‌న‌ల్ కెరీర్‌.. స్టార్ యాక్ట‌ర్ గా ఎదిగింది. ఆమె గురించి తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. ఇక నిత్యం సోష‌ల్ మీడియాలో కూతురితో క‌లిసి ఆమె చేసే ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

కొన్ని సార్లు ఆమె నెటిజ‌న్ల‌ను కూడా బాగానే ఆడుకుంటారు. ఇక అప్ప‌ట్లో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే వీటిపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈటీవీలో వ‌చ్చే ఆలీతో స‌ర‌దాగా ప్రోగ్రామ్ లో ఆమె పాల్గొన్నారు. ఆలీ పెళ్లి గురించి అడ‌గ్గా.. తాను రెండో పెళ్లి చేసుకోన‌ని చెప్పేశారు. ఒక వేళ అదే నిజ‌మైతే నెటిజ‌న్లే పెళ్లి కొడుకును వెత‌కాలంటూ వ్యంగ్యంగా స‌మాధానం ఇచ్చారు. తాన పెళ్లి చేసుకుంటే డ‌బ్బున్న వాడినే చేసుకుంటాన‌ని స‌మాధానం ఇచ్చారు.

అయితే డ‌బ్బు ముఖ్యమా? మ‌న‌సు ముఖ్య‌మా అని ఆలీ అడగ్గా.. మ‌న‌సుతో ప‌నులు కావ‌ని ఆమె తేల్చి చెప్పారు. త‌న భ‌ర్త ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డంతో చ‌నిపోయారని, అప్పుడు త‌న‌కు ఎవ‌రూ అండ‌గా నిల‌వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాగా ఆ విష‌యంపై త‌న‌ను, త‌న కూతురిని బ్లేమ్ చేశార‌న్నారు. అందుకే రెండో పెళ్లిపై తాను అలా స్పందించాన‌ని చెప్పారు. ఇక ఈ ప్రోమో ఇప్పుడు వైర‌ల్ గామారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version